
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ నిర్మించిన భారీ హిస్టారికల్ మూవీ . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించిన నార్త్‌లో మాత్రం నిరాశపరిచింది. వార్, జోకర్ సినిమాలతో పోటి పడాల్సి రావటంతో సైరా హిందీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందన్న విషయాన్ని కూడా అంగీకరించాడు చరణ్. అంతేకాదు ఒక దశలో సైరా సినిమాను ఆపేద్దామా అన్న ఆలోచన కూడా చేసినట్టుగా చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. Also Read: గ్రాఫిక్స్, సెట్స్ ఇలా అన్ని కలిపి బడ్జెట్ 75 కోట్లకు పైగా ఖర్చు చేసిన తరువాత సినిమా విషయంలో ముందుకెళ్లాలా వద్ద అన్న ఆలోచన కూడా చేశామని తెలిపాడు. అయితే ఆ దశలో ఏ నిర్మాత సినిమాను ఆపే ప్రయత్నం చేయడని అందుకే నేను కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్లానని తెలిపాడు. అంతేకాదు సైరా కోసం చిరు, తమన్నాలపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పాటను సినిమా నిడివి ఎక్కువవుతుందన్న కారణంతో తొలగించారట. Also Read: దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ వసూళ్లు సాధించింది. 250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి నాన్ బాహుబలి రికార్డ్‌లు అన్నింటిని చెరిపేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 275 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెళ్లడించారు. దాదాపు అన్ని చోట్ల సినిమా కలెక్షన్లు పడిపోవటంతో ఇదే ఫైనల్ కలెక్షన్లు అయ్యే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సుధీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు. రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటించారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wi7uBc
No comments:
Post a Comment