Thursday 31 October 2019

సముద్రంలో జలకాలాట.. మాల్దీవుల్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న రేణు దేశాయ్

మల్టీ టాలెండెట్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన ఆమె.. మరాఠి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలుగా ఒక సినిమా, నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉంటూనే పిల్లలతోనూ ఆనందమైన వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు రేణు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు. Also Read: ‘‘పర్వతాలు నా హృదయమైతే, మహాసముద్రం నా ఆత్మ అని ఇప్పుడు నాకు తెలిసింది. ఈ మాల్దీవులు విహారయాత్రలో సముద్రంలో నేను ఒంటరిగా గంటలపాటు ఈతకొట్టిన తరవాత ఈ విషయం నాకు అర్థమైంది. ఒక చేప ఆత్మ నాలో ఉందని తెలుసుకున్నాను. అగ్ని నాకు ఇష్టమైన భూతం అంటే వెటకారంగా అనిపించేది. అగ్ని అనే కాన్సెప్ట్‌కు నేను బాగా ఆకర్షితురాలి అయ్యాను. కానీ, నీటిలో ఉంటే ఇంట్లో ఉన్న భావన కలుగుతోంది. జీవితం అంటే ఇదే అని ఇప్పుడు నాకు తెలిసింది. వ్యంగ్యాలు, వైరుధ్యాలు’’ అని వేదాంతం చెప్పుకొచ్చారు రేణు. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య.. తమ తండ్రి పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నట్టు తెలిసింది. దీపావళి పండుగకు వీళ్లిద్దరూ తండ్రి వద్దకు వచ్చారు. చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో తండ్రి పవన్‌తో కలిసి వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఆయన దగ్గరే ఉన్నట్టు తెలిసింది. అందుకే, రేణు దేశాయ్ ఒంటరిగా మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లినట్టున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36jVBPV

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz