Tuesday 29 October 2019

యాంటీ ఏజింగ్ బ్యూటీ డ్రింక్.. రోజూ తాగితే మెరిసిపోతారు..

మన శరీరంలో ఇతర అవయవాలలాగానే, చర్మం కూడా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ముఖ్యపోషకాలు అవసరం. మన శరీర అవయవాలలో సున్నితమైనది. అన్నిటికన్నా పరిమాణంలో పెద్దది. కానీ, చర్మమే బయటి వాతావరణం కారణంగా ఎక్కువ ప్రభావితం అవుతుంది. అయితే మనం బయటి వాతావరణంలో మార్పులను కొంతవరకే నియంత్రించగలం కాబట్టి, శరీరం లోపలి వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటం ముఖ్యం. హార్మోన్ల సమతుల్యత, కొన్ని పోషకాల లోపం ఇవన్నీ చర్మానికి చాలా సమస్యలు తెస్తాయి. అందుకని కేవలం బయటకి అందంగా కన్పించటానికి ఖరీదైన కాస్మెటిక్స్ ను వేలు పోసి కొనేటప్పుడు, కొంచెం సమయం కేటాయించి ఆరోగ్యకరమైన డైట్ ను చర్మం కోసం కూడా పాటిస్తే మంచిది. చర్మసంరక్షణ టిప్స్... చర్మం ఆరోగ్యాన్ని పెంచే పోషకాల గురించి మాట్లాడితే.. యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, -6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, విటమిన్ సి. యాంటీఆక్సిడెంట్లు మొక్కల నుండి వచ్చే చాలా ఆహారపదార్థాలు అంటే పండ్లు, కాయగూరలు, దినుసులు అన్ని కూడా మొక్కలలో ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని ముఖ్య విటమిన్లు వీటిల్లో సాధారణంగా ఉంటాయి. అలాగే, ఫ్యాటీయాసిడ్లు విత్తనాలు, నట్స్, మందంగా ఉన్న చేపలలో ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో సాయపడుతుంది, విటమిన్ ఇ చర్మాన్ని సూర్యకాంతి, యువి కిరణాల నుండి రక్షణకి ముఖ్యమైనది. యాంటీ ఆక్సిడెంట్లు లోపలి వాపులను తగ్గించడానికి పోరాడతాయి, ఫలితంగా బయట చర్మంపై మచ్చలు, చారలు, మొటిమలు లేకుండా ఉంటుంది. ఈ అన్ని పోషకాలను కలిపి ఒకే రుచికరమైన డ్రింక్ గా రెసిపి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి, పసుపు డ్రింక్.. ఈ డ్రింక్ లో అరటిపండు, పైనాపిల్, అవిసెగింజలు, కొబ్బరిపాలు, కొబ్బరినూనె, అల్లం, దాల్చినచెక్క పొడి, పసుపు ఉంటాయి. ఈ డ్రింక్ ను మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకుంటే భోజనంలో యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె, పాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యమైన విటమిన్లని కలిగివుంటాయి, అలాగే అవిసెగింజలు మీకు సరిపడినంత ఒమేగా ఫ్యాటీయాసిడ్లని అందిస్తాయి. అల్లం,పసుపు రెండు వేర్లగా వాడే దినుసులు, ఇవి చర్మం సాగే గుణాన్ని మెరుగుపర్చి, వాపులతో పోరాడటం వంటివి చేసి వయస్సు పైబడే లక్షణాలను తగ్గిస్తాయి. ఈ డ్రింక్ ను తయారుచేసుకోవటం ఇలా : 1. అరటిపండు, పైనాపిల్ ను ముక్కలుగా తరగండి. 2. ఒక బౌల్ లో ఈ పండ్లముక్కలను వేసి, అందులో అవిసెగింజలు, తురిమిన అల్లం, కొబ్బరి నూనె, దాల్చినచెక్క పొడి, పసుపు పొడిని కూడా వేయండి. 3. కొబ్బరిపాలను కూడా పోసి చేత్తో కలుపుతూ చిదిమే బ్లెండర్ ను ఉపయోగిస్తూ అన్ని పదార్థాలని బాగా కలపండి. 4. మీకు ఈ డ్రింక్ తియ్యగా కావాలనుకుంటే కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా, చర్మం పొడిబారకుండా చూసుకోవటం ముఖ్యం. ఆరోగ్యకరమైన, శుభ్రమైన చర్మం కోసం బయట ఎండలో తిరిగొచ్చాక మీ ముఖాన్ని కడుక్కోండి. పండ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి మంచివే. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిగ్గా అందంగా కనిపిస్తాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మన శరీరంలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవాలి. తేమ లేని కారణంగా ఎవరైనా సరే నిర్జీవంగా కనిపిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. చాలా మంది పండ్లు తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. అలాంటివారు ఇలా ఫ్రూట్స్‌ని ఉపయోగించి డ్రింక్స్ చేసుకుని హ్యాపీగా తాగి ఆరోగ్యంగా అలానే అందంగా ఉండొచ్చు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/36jEbmg

No comments:

Post a Comment

'Trump Respects The Indian People'

'The relationship between India and the US, when Donald Trump was president, had been so much stronger.' from rediff Top Interview...