Tuesday 29 October 2019

పూనమ్ కౌర్ ట్వీట్.. మళ్లీ Pawan Kalyanనే టార్గెట్ చేసిందా?

ప్రముఖ నటి మరోసారి తన ట్వీట్‌తో వార్తల్లోకెక్కింది. ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉండే పూనమ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. ‘ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు కాలేడు’ అని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ టార్గెట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనసేనాని అభిమానులేమో అనవసరంగా ఆయన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా సేపటి వరకు ఈ ట్వీట్‌పై చర్చ జరిగింది. దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్’ అని పూనమ్ పేర్కొంది. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నోటికొచ్చినట్లు చేసే ట్వీట్లకు అసలు స్పందించకపోవడమే మంచిదని అంటున్నారు. ఏమైనా గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న పూనమ్ కౌర్.. తన ఒక్క ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పూనమ్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఎన్నో ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తనకు ముందు ‘అఆ’ సినిమాలో అవకాశం ఇస్తానన్నారని కానీ ఇవ్వలేదని ఆరోపించింది. అసలు పూనమ్ ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందో ఎందుకు చేసిందో తనకే తెలియాలి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. కనీసం ఈ రకంగా ట్వీట్లు చేస్తే అయినా పాపులారిటీ వస్తుందని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ సినిమా రంగానికి చెందిన ఆమె రాజకీయాల్లో తలదూర్చకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు సూచనలు ఇస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NmQYfg

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz