Sunday, 27 October 2019

రానా సంచలన ఆరోపణలు..`ఆ నిర్మాతను నమ్మొద్దు..!`

ఒకప్పుడు తన సినిమాలతో వార్తల్లో ఉండే ఇటీవల వరుసగా రూమర్స్‌, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా రానా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఒకటి రిలీజ్‌ అయ్యింది. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్‌ పేట్రియాటిక్‌ సినిమాను ప్రకటించాడు రానా. తరువాత ఇతర సినిమాలతో రానా బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయినట్టే అని భావించారు అంతా. కానీ సడన్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను ఇచ్చారు చిత్రయూనిట్‌. ఈ సినిమా జనవరి 24న రిలీజ్‌ అవుతుందని వెల్లడించారు. Also Read: ఎస్‌ ఎన్‌ రాజరంజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివకుమార్‌దర్శకుడు. తన సినిమాల ప్రమోషన్‌ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉండే రానా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మాత్రం ట్వీట్ చేయలేదు. అంతేకాదు సదరు చిత్ర నిర్మాతపై సంచలన ఆరోపణలు చేశాడు. 1945 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న రానా. `నిర్మాత పారితోషికాల విషయంలో మోసం చేయటంతో సినిమా పూర్తి కాలేదు. దాదాపు సంవత్సర కాలంగా నేను ఈ చిత్రయూనిట్‌ను కనీసం కలవలేదు. మరింత మందిని మోసం చేసిన డబ్బు చేసుకునేందుకు ఇది నిర్మాత ఆడుతున్న నాటకం. ఇలాంటి వారిని నమ్మకండి` అంటూ ట్వీట్ చేశాడు. అయితే రానా తన ట్వీట్‌ను కొద్ది సేపటికి ట్విటర్‌ నుంచి డిలీట్ చేశాడు. Also Read: అయితే రానా వ్యాఖ్యలపై నిర్మాత కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. `సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందో లేదో నిర్ణయించాల్సింది దర్శకుడు. అయినా సినిమా అసంపూర్తిగా ఉందేమో నిర్ణయించే అవకాశం ప్రేక్షకులకు ఇద్దాం. దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పూర్తికాని సినిమాను ఎవరూ రిలీజ్‌ చేయరు` అంటూ రిప్లై ఇచ్చాడు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన రానా ప్రస్తుతం షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నబహుభాషా చిత్రం హాథీమేరి సాథీ సినిమాను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు వెంకీ ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాను కూడా రానా పూర్తి చేయాల్సి ఉంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34hEgW7

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...