Saturday, 26 October 2019

`అర్జున్‌ సురవరం`కి మోక్షం.. ఈ సారైనా వస్తాడా?

యంగ్ హీరో నిఖిల్‌కి ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావటం లేదు. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ ముందు నిరాశపరిచాయి. 2016లో రిలీజ్‌ అయిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా తరువాత నిఖిల్ నటించిన ఏ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. వరుసగా కేశవ, కిరాక్‌ పార్టీ సినిమాలతో నిరాశపరిచాడు నిఖిల్. ఆ తరువాత ఎన్నో ఆశలతో సినిమాను చేశాడు. తమిళ్‌లో సూపర్‌ హిట్ అయిన కనితన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేశాడు. ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తడంతో తప్పని సరి పరిస్థితుల్లో టైటిల్‌ను అర్జున్‌ సురవరంగా మార్చారు. అయితే నిఖిల్ కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. Also Read: సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించినా అనుకున్న సమయానికి రిలీజ్‌ చేయలేకపోయారు. ముందుగా ఈ సినిమాను మేలోనే రిలీజ్ చేయాలని భావించినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఒక దశలో జనం కూడా నిఖిల్ సినిమా ఒకటి రిలీజ్‌కు ఉన్న విషయమే మర్చిపోయారు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. Also Read: నవంబర్‌ 29న అర్జున్‌ సురవరం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో చాలా సార్లు ఇలా రిలీజ్‌ డేట్‌ ప్రకటించి తరువాత సినిమాను వాయిదా వేశారు. మరి ఈ సారైనా అనుకున్నట్టుగా సినిమా రిలీజ్‌ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేశాస్తున్నారు సినీ జనాలు. నిఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు టి. సంతోష్ దర్శకుడు. ఠాగూర్‌ మధు సమర్పణలో రాజ్‌ కుమార్ ఆకెళ్ల ఈ సినిమాను నిర్మించారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సామ్‌ సీఎస్‌ సంగీతమందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MP9y0z

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...