Saturday, 26 October 2019

హైదరాబాద్‌లో RRR షూటింగ్.. ఈసారి శరవేగంగా, ప్రత్యేకంగా!

ర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ గ్యాప్ తర్వాత మళ్లీ పట్టాలకెక్కుతోంది. లండన్ నుంచి తిరిగొచ్చిన రాజమౌళి.. సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ సోమ‌వారం (అక్టోబర్ 28) నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లు కానుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా స్క్రీనింగ్‌ కోసం రాజ‌మౌళి ఇటీవల లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ప్రభాస్, అనుష్క, రానా, చిత్ర నిర్మాత‌లు అక్కడికి వెళ్లారు. ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో సినిమా ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌కు వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, చెర్రీపై కీలక సన్నివేశాలు.. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్దరూ పాల్గొంటారు. వీరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వ‌చ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. Don't Miss: ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్‌ హీరో అజయ్‌ దేవగన్‌, కోలీవుడ్ నటుడు సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆది నుంచి అవాంతరాలే.. రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. చారిత్రక సంఘటనలకు ఫాంటసీని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తుండటం మరో ప్రత్యేకత. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ ఇదేనని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. Also Read: అయితే.. ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌కు ఆది నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఒక్క షెడ్యూల్‌ కూడా ముందుగా అనుకున్నట్టుగా సాగటం లేదు. షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే రామ్‌ చరణ్‌ గాయపడటం, అప్పటికి ఎన్టీఆర్‌ తన పాత్ర కోసం పూర్తిగా సిద్ధం కాకపోవటంతో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ షూటింగ్‌కు హాజరైనా.. కొద్ది రోజులకే ఆయన కూడా గాయపడటంతో మరోసారి షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. తర్వాత రామ్‌ చరణ్‌ ఫిట్‌గా రెడీ అయినా.. సైరా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండటంతో చరణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా లండన్ ప్రోగ్రామ్‌తో మరోసారి బ్రేక్ పడింది. ఈసారైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ పూర్తి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2onTGJ0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....