Sunday 27 October 2019

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నిర్మాత మాంచి జల్సా రాయుడు

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే వివాదాలు గుర్తుకొస్తాయి. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసిన ఈ సీనియర్ దర్శకుడు ఇప్పుడు ఏ చిత్రం తీసినా వివాదమే. మొన్నామధ్య ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక వర్గం‌ను టార్గెట్‌ చేస్తూ తీసిన సినిమా ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంకో సినిమాను వదులుతున్నారు. అదే ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ చిత్ర ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ టాప్ 1 ట్రెండింగ్. ఈ ఆనందాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. Also Read: ఇదిలా ఉంటే, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ద్వారా కొత్త నిర్మాత ఒకరు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆయన పేరు అజయ్ మైసూర్. ఇంతకీ ఎవరితను అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తే ఉంటుంది. ఈ విషయాన్ని ఊహించే అజయ్ మైసూర్ గురించి వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అజయ్‌ను ఇండియన్ డాన్ బిల్జరియాన్‌గా పోల్చారు వర్మ. అంతేకాదు, అందమైన అమ్మాయిల మధ్య స్టైల్‌గా కారులో కూర్చున్న అజయ్ ఫొటోను కూడా వర్మ షేర్ చేశారు. అజయ్‌కు కార్లన్నా కూడా అమితమైన ప్రేమ అని వెల్లడించారు. ఇంతకీ అజయ్‌ను డాన్ బిల్జరియాన్‌తో పోల్చడం వెనుక అసలు అర్థం ఏమిటో తెలిసిందా..? అదేనండి.. మాంచి జల్సా రాయుడు అని. హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన డాన్ బిల్జరియాన్ ప్రపంచంలోనే పేరుగాంచిన జల్సా రాయుడు. ఎప్పుడూ లావిష్ లైఫ్‌ను అనుభవిస్తూ ఉంటారు. ఆయన సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో.. ఖర్చు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డాన్ జల్సాలు ఎలా ఉంటాయో చూడాలంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే చాలు. ఈయన గొప్ప జూదగాడు. జూదంతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అంతే, సులభంగా ఖర్చు చేస్తుంటారు. డాన్ చుట్టూ ఎప్పుడూ ఓ పది మంది అమ్మాయిలు ఉండాల్సిందే. అది కూడా అందమైన సుందరాంగులు. ఒంటిపై అస్సలు బట్టలు నిలవని సొగసరి భామలు. వీళ్లతో బీచుల్లో ఎంజాయ్ చేస్తుంటారు డాన్. ప్రతి రోజూ పార్టీలే. అలాంటి వ్యక్తితో అజయ్‌ను వర్మ పోల్చారు వర్మ. అంటే, ఈయన కూడా మంచి జల్సారాయుడు అన్నమాట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WjqYp8

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc