ఓరి వర్మా.. నువ్ మామూలోడివి కాదురా సామీ.. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ చూశాక చాలామంది ప్రేక్షకుల నుండి వచ్చే మాట ఇదే. అయితే ట్రైలర్ నిజంగానే అంత అద్భుతంగా ఉందా? విజువల్స్ అదిరిపోయాయా? టేకింగ్ చింపేశాడా? కంటెంట్ కట్టిపడేశాలా ఉందా? అంటే.. ఇవన్నీ ఉండి అట్రాక్ట్ చేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు. అతని సినిమాల్లో ఇవేమీ మచ్చుకైనా కనిపించవు. ఆరోజులు పోయి దశాబ్ధాలు దాటేసింది. అయినా సన్సేషన్స్ క్రియేట్ చేస్తాడు. వివాదం అనేదే అతని సినిమాకి పెట్టుబడి, రాబడి. కథలో కంటెంట్ లేకపోయినా వివాదం ఉంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయ్.. కాస్తో కూస్తో జేబులు కూడా నింపుకోవచ్చనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అప్ కమింగ్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశాడు. Read Also: 2.50 నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ ట్రైలర్ విడుదలై కొన్ని నిమిషాల్లోనే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీలోని రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణాలను ప్రధానంగా చూపించారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వ్యూహాలు, పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు, తెరవెనుక జరుగుతున్న కుట్రలను వర్మ మార్క్‌తో ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా ఆయా పాత్రలకు కరెక్ట్‌గా సరిపోయే వాళ్లను వెతికిపట్టుకుని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కథను రక్తి కట్టిస్తున్నాడు వర్మ. బాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్ వీరాభిమానులు ఈ డూప్లికేట్ యాక్టర్స్‌ని ఒరిజినల్ పాత్రల్లో జీర్ణించుకోవడం కాస్త కష్టమే కాని.. మేనరిజమ్‌ని వాళ్ల నుండి ఒడిసిపట్టుకున్నాడు వర్మ. గతంలో ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, వీరప్పన్ చిత్రాల్లో సైతం పాత్రలకు సూటయ్యే నటీనటులను వెతికిపట్టుకున్నారు వర్మ. అయితే వర్మ ప్రజెంటేషన్‌లోనూ వాస్తవికత ఎంతన్నది ఆయనకే తెలియాలి. అసలు వర్మ నిజాలనే చూపిస్తున్నా? లేక వక్రీకరిస్తున్నారా? ఒక వర్గం వారికి సపోర్ట్ చేస్తూ మరొక వర్గాన్ని కించపరుస్తూ వర్మ ఏదోలా వివాదాన్ని రాజేసి తద్వారా సినిమాను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలోనూ నిజం లేకపోలేదు. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ట్రైలర్‌లో వర్మ.. మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు స్పష్ఠంగా తెలుస్తూనే ఉంది. అలాగే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను సైతం వదలకుండా వర్మ పైత్యాన్ని మొత్తం చూపించేశారు. వీరే కాకుండా ప్రధాని మోదీ నుండి అమిత్ షా, కేఏ పాల్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలకుండా మొత్తం అదర్నీ చుట్టేశారు వర్మ. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ట్రైలర్‌లో జగన్ పాత్రధారి ఒక వ్యక్తిని లాగిపెట్టి చెంపచెల్లు మనిపించే సీన్ ట్రైలర్‌లో హైలైట్ అయ్యింది. ఇంతకీ జగన్ ఎవర్ని కొట్టాడు? అంత కోపం జగన్‌కి ఎందుకొచ్చింది? ఎవరా వ్యక్తి అంటే.. అప్పట్లో జగన్ ఓ టీవీ ఛానల్ సీఈఓను కిడ్నాప్ చేసి కుమ్మేశాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వర్మ ట్రైలర్‌లో జగన్ చేతిలో చెంపదెబ్బలు తింటున్నది ఎవరో కాదు.. ఆ టీవీ ఛానల్ సీఈఓ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లో జగన్ చేతిలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి చూడ్డానికి రౌడీలా ఉండటం.. మరో సీన్‌లో అతనే షాప్‌లను తగలబెడుతున్నట్టుగా కనిపించడం ఇతను అతనేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆ టీవీ ఛానల్ సీఈఓ పాపం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. మళ్లీ అతన్ని వర్మ తెరపైకి తీసుకువచ్చి పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారా? లేక జగన్ చేతిలో దెబ్బలు తిన్న మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తెలియాలంటే చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/369wvmQ
No comments:
Post a Comment