Sunday 27 October 2019

సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ ఒకే సెట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’ షూటింగ్ కిందటేడాది ప్రారంభమైంది. తొలి రెండు షెడ్యూల్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరిపై కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరవాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై వేర్వేవేరుగా కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. కొన్ని కారణాల చేత రామ్ చరణ్ షూటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదు. చరణ్ కాలికి గాయం కావడం, ఆ తరవాత ‘సైరా’ సినిమా పనుల్లో ఆయన బిజీ కావడంతో ‘RRR’ షూటింగ్‌కు కాస్త దూరం కావాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని రాజమౌళికే కేటాయించనున్నారు. మళ్లీ తారక్‌తో కలిసి నటించనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. ఈ షెడ్యూల్‌లో మళ్లీ చరణ్, తారక్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్ వేసినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఎలాంటి విరామం లేకుండా ఈ షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేయనున్నారని తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ‘RRR’ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు పుట్టుకొచ్చేశాయి. రామ్ చరణ్ షూటింగ్‌కు దూరం కావడాన్ని కారణంగా చూపుతూ.. సినిమా అనుకున్న సమయానికి విడుదల కాదని, వాయిదా పడుతుందని వార్తలు సృష్టించారు. అయితే, వీటిలో నిజం లేదని ఇటీవల రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. ముందు ప్రకటించినట్టుగానే వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదలవడం ఖాయమని చెప్పారు. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. అయితే, తారక్ సరసన నటించే నటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. కథ ప్రకారం ఆయన ఇక బ్రిటిష్ దొరసానిని ప్రేమిస్తారు. ఆ దొరసాని పాత్ర కోసం మొదట బ్రిటిష్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్‌ను తీసుకున్నారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. Also Read: ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేసుకోలేక రాజమౌళికి నో చెప్పిందని అన్నారు. ఆ తరవాత మరో బ్రిటిష్ అమ్మాయిని ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, దానిలో నిజమెంతో తెలీదు. రాజమౌళి అధికారికంగా ప్రకటించేంత వరకు ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరో చెప్పలేం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/346P0pW

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz