Sunday, 27 October 2019

రామ్ దీపావళి సర్‌ప్రైజ్.. మళ్లీ ఆ డైరెక్టర్‌తోనే సినిమా

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ సినిమా విడుదలై 100 రోజులు పూర్తయినా ఇంకా తన తరవాత ప్రాజెక్ట్ ప్రకటించలేదంటని రామ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి దీపావళి నాడు అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు రామ్. తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తనతో ‘నేను శైలజా’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు చేసిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో తన తరవాత సినిమా చేయబోతున్నారు రామ్. Also Read: ఇది రామ్‌కు 18వ సినిమా. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రేపు (అక్టోబర్ 28న) విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేస్తారు. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్‌తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలూ క్లాసే. లవ్, ఎమోషన్స్‌తో కూడిన మంచి సినిమాలు అవి. మరి ఇప్పుడు మూడోసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. రేపు టైటిల్, ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఒక క్లారిటీ వస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BOUgm9

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...