Saturday, 26 October 2019

‘రాములో.. రాములా’ ఊపేస్తుందిరో! బన్నీ దీవాళి ట్రీట్ సూపరో

‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు’.. ఏ నోట విన్నా ఈ పాటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. అల వైకుంఠపురములోని ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313 లైక్స్ సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ పాటకు 45 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ రావడంతో అత్యధిక వ్యూస్ లైక్స్ సాధించిన పాటగా ‘సామజవరగమన’ పాట సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఈ పాటకు సిద్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ స్వరపరిచారు. ఇక ఇదే జోష్‌ను కొనసాగిస్తూ దీపావళి కానుకగా మారో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘రాములో రాములా’’ అంటూ మంచి ఊపునిచ్చే బీట్‌ సాంగ్‌తో బన్నీ రచ్చ చేస్తున్నాడు. పబ్‌లో ఈ ఊరమాస్ పాట పిక్చరైజేషన్ అదిరిపోతుంది. సింగర్ మంగ్లీ కంచుకంఠం ఈ పాటకు మరింత ఊపినిచ్చింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు గాయకులు అనురాగ్, మంగ్లీలతో పాటు ఈ చిత్రంలో నటించిన అల్లు అర్జున్, పూజా, సుశాంత్, సునీల్, నవదీప్, టబు తదితరులంతా స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. సాంగ్ ఎండింగ్‌లో వీరంతా కలిసి ప్రేక్షకులకు దీవాళి శుభాకాంక్షల్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పాట 5 మిలియన్స్ వ్యూస్‌కి చేరువై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Nl30Wi

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...