ఎనర్జిటిక్ స్టార్ చాలా కాలం తరువాత సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ కెరీర్‌ను గాడిలో పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఓ సూపర్ హిట్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీపావళి సందర్భంగా ఆదివారం తన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశాడు రామ్. తన 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్‌లో తెరకెక్కిచనున్నారు. అంతేకాదు ఈ సినిమాకు గతంలో రామ్ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలను తెరకెక్కించిన దర్శకత్వం వహించనున్నారు. Also Read: అయితే ఇక్కడే రామ్ సెలక్షన్ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి. రామ్‌చేయబోయేది తమిళ్‌లో సూపర్ హిట్ అయిన తడం సినిమాకు రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ హీరోగా మగిల్ తిరుమణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయంలో నటించగా విద్యా ప్రదీప్, తానా హోపేలు హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు రామ్. అంతేకాదు రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఈ సినిమాతో రామ్. అయితే ఈ సినిమాకు కిశోర్ తిరుమలను దర్శకుడిగా ఎంచుకోవటంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిశోర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లను మాత్రమే తెరకెక్కించాడు. Also Read: సెకండ్ హ్యాండ్ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన కిశోర్, తరువాత నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎలా డీల్ చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామ్ మాత్రం కిశోర్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ జోడిగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మలను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అదిస్తున్నాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పి డైరెక్టర్‌తోనే తన నెక్ట్స్ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. మరి రామ్ నమ్మకాన్ని కిశోర్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NlyBHH
No comments:
Post a Comment