Sunday, 27 October 2019

మనోజ్‌కు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా..? మంచు కుటుంబంలో అంతా ఓకెనా..?

సీనియర్ హీరో మోహన్‌ బాబు వారుసులుగా ఆయన ముగ్గురు పిల్లలు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా టెలివిజన్‌ హోస్ట్‌గా మంచి విజయాలు సాధించారు. కూడా హీరోగా పరవాలేదనిపించాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌లతో సక్సెస్‌లు సాధించి హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడు. కానీ మనోజ్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా కథల ఎంపికలో తడబడుతూ వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను పాడు చేసుకున్నాడు మనోజ్‌. దీంతో కొంత కాలం సినిమాలకు దూరమయ్యాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణతి రెడ్డితో మనస్పర్థలు రావటంతో ఆమెతో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఇక మీదట పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెడతానని, చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని తెలిపాడు. Also Read: ఇటీవల తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్న మనోజ్‌ త్వరలో తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా దీపావళి సందర్భంగా తన నిర్మాణ సంస్థ పేరును ప్రకటించాడు. ఇప్పటికే మంచు ఫ్యామిలీలో మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మోహన్‌ బాబు, విష్ణు, లక్ష్మీలకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మనోజ్‌ కూడా మరో నిర్మాణ సంస్థను స్టార్ట్‌ చేశాడు. Also Read: అయితే మనోజ్‌ ప్రకటనపై మంచు కుటుంబ సభ్యులు స్పందించకపోవటం ఆసక్తికరంగా మారింది. మనోజ్‌ తన నిర్మాణ సంస్థను ప్రకటించిన తరువాత విష్ణు, లక్ష్మీ, మోహన్‌బాబులలో ఎవరు కూడా కనీసం శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ట్వీట్ చేయలేదు. మనోజ్‌ ట్వీట్‌పై స్పందించటం కూడా చేయలేదు. చిన్న చిన్న విషయలపై కూడా ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేసే మంచు లక్ష్మీ కూడా తన తమ్ముడి జీవితంలో కీలక పరిణామంపై కామెంట్‌ చేయకపోవటంతో మంచు ఫ్యామిలీలో అంతా ఓకేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు దీపావళి సందర్బంగా మంచు విష్ణు సినీ ప్రముఖులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌, కృష్ణంరాజు, రాఘవేంద్ర రావు లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో మనోజ్‌ కనిపించలేదు. దీంతో మనోజ్‌ నిర్ణయానికి మంచు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ పరిణామాల్లో అసలు విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2q0oBM0

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...