Sunday, 27 October 2019

సౌత్‌లో నెంబర్‌ వన్‌.. రికార్డ్‌లు సృష్టిస్తున్న `రాములో రాములా`!

స్టైలిష్ స్టార్‌ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం . త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌. రెండు పాటలను రిలీజ్ చేశారు. తొలి పాట సామజవరగమన ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతుండగా లేటెస్ట్ సెన్సేషన్‌ యూట్యూ్‌బ్‌ రికార్డ్‌లను బ్రేక్‌ చేస్తోంది. దీపావళి సందర్భంగా శనివారం విడుదల చేసిన ఈ పాట 24 గంటల్లో 8.3 మిలియన్ల (83 లక్షల) వ్యూస్‌ సాధించి రికార్డ్ సృష్టించింది. లైక్స్‌ విషయంలోనూ రాములో రాములా రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకు 3లక్షల 40 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. Also Read: సౌత్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా రికార్డ్‌ సృష్టించింది రాములో రాములా. మాస్‌ బీట్‌లో తమన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ (సత్యవతి) అలపించారు. కాశర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. ఈ పాటను కలర్‌ఫుల్‌ ఫ్యామిలీ పార్టీ సాంగ్‌గా చిత్రీకరించారు త్రివిక్రమ్‌. బన్నీ లుక్‌, స్టె్ప్స్‌ పాటకు మరింత అందం తీసుకువచ్చాయి. ఈ పాటలో బన్నీతో పాటు పూజా హెగ్డే, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, టబు, జయరామ్‌లు కూడా ఆడిపాడారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36dAMFx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....