Sunday, 27 October 2019

చిన్న కూతురిని చిరంజీవికి పరిచయం చేసిన మంచు విష్ణు

హీరో, నిర్మాత మంచు విష్ణు తన చిన్న కూతురు ఐరా విద్యను మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. మెగాస్టార్ ఒళ్లో తన కూతురుని పెట్టి ఆశీర్వదించమని అడిగారు. దీనికి శంషాబాద్‌లోని మంచు విష్ణు నివాసం వేదికైంది. ఆదివారం దీపావళి సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మంచు విష్ణు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. Also Read: ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు ముచ్చటించిన విష్ణు, విరానికా దంపతులు.. తమ గారాలపట్టిని ఆయన చేతిలో పెట్టారు. అక్కడ తీసుకున్న ఫొటోలను విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను’’ అని తన పోస్టులో విష్ణు పేర్కొన్నారు. విష్ణు షేర్ చేసిన ఫొటోల్లో మోహన్ బాబు, రాజారవీంద్ర కూడా ఉన్నారు. కాగా, విష్ణు-విరానికా దంపతులకు నలుగురు సంతానం. విష్ణు 2009 మార్చిలో విరానికాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2011 డిసెంబ‌ర్‌లో ఈ దంప‌తుల‌కి కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. ఇక 2018లో వారికి మగబిడ్డ జ‌న్మించాడు. ఆ చిన్నారికి అవ్‌రామ్ భక్త అని నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో నాలుగో సంతానంగా ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఈ పాపకు ఐరా విద్య అని పేరు పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31OZcSG

No comments:

Post a Comment

The Sridevi Interview You Must Read

'If I'm playing Shah Rukh Khan's role, then of course, I would have loved to do it.' from rediff Top Interviews https://if...