Sunday, 27 October 2019

చిట్టి నడుముని ఒడిసి పట్టు.. ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ పోస్టర్లు అదుర్స్

యంగ్ హీరో నితిన్, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని నితిన్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. అయితే, అభిమానుల దాహాన్ని తీర్చేలా దీపావళి సందర్భంగా అదిరిపోయే పోస్టర్లను నితిన్ వదిలారు. ‘భీష్మ’ ఫస్ట్‌లుక్‌గా రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లు అదిరిపోయాయి. Also Read: ఒక పోస్టర్ డుష్యుం డుష్యుం ఫైట్లతో మాస్‌గా ఉంటే.. మరొక పోస్టర్ రష్మిక మందన చిట్టి నడుముతో రొమాంటిక్‌గా ఉంది. రష్మిక ఏదో ఆలోచిస్తూ వెళ్తుంటే వెనుక నుంచి నితిన్ ఆమె చిట్టి నడుమును ఒడిసి పట్టుకోవాలన్నంటు చాలా దగ్గరగా వచ్చినట్టు ఒక పోస్టర్‌లో ఉంది. ఈ రెండు పోస్టర్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక, నితిన్ ఉన్న పోస్టర్ చాలా రొమాంటిక్‌గా అనిపిస్తోంది. రష్మిక చీరలో చాలా అందంగా కనిపించగా.. నితిన్ సూట్‌లో హుందాగా ఉన్నారు. ఇక రెండో పోస్టర్‌లో నీట్‌గా టక్ చేసుకుని ఉన్న నితిన్.. రౌడీలను ఈడ్చి ఈడ్చి కొడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ రెండు పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవే పోస్టర్లను నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్‌లో అయితే స్పందన అద్భుతం. ఇది కచ్చితంగా నితిన్‌కు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ‘అ.. ఆ’ తరవాత ఆ స్థాయి హిట్‌ను నితిన్ అందుకోలేదు. ‘లై’, కిందటేడాది వచ్చిన ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ‘భీష్మ’తో నితిన్ హిట్టు అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, దీంతో పాటు మరో మూడు సినిమాలను నితిన్ చేస్తున్నారు. ‘భీష్మ’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BL7H6m

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....