Sunday, 27 October 2019

చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి వస్తున్నా.. అందరికీ చెప్పండి: నిఖిల్

యంగ్ హీరో నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. గతేడాది మార్చిలో ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ తరవాత మళ్లీ నిఖిల్ నుంచి ఇంకో సినిమా రాలేదు. వాస్తవానికి నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. ఈపాటికే ఆ సినిమా విడుదలైపోవాలి. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. గడిచిన ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తోన్న ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్ సురవరం’ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ప్రేక్షకుల్లో ఇంకా అనుమానమే. నిజంగా ఆ తేదీకి సినిమా వస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ, హీరో నిఖిల్ మాత్రం పక్కా అంటున్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పమని అడుగుతున్నారు. ఈ మేరకు దీపావళి నాడు.. అంటే ఆదివారం నిఖిల్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నిఖిల్ స్టైల్లోనే ఉంది. ‘‘ఒక మహానుభావుడు చెప్పాడు.. కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా. దీపావళి సందర్భంగా చెప్తున్నా.. చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి నా సినిమా వచ్చే సమయం వచ్చింది. ప్రియమైన మిత్రులారా.. ‘అర్జున్ సురవరం’ 2019 నవంబర్ 29న విడుదలవుతోందని అందరికీ చెప్పండి. స్పష్టత కోసం సంవత్సరం కూడా చెప్పా’’ అని నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనితన్’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. టి.సంతోష్ దర్శకత్వం వహించారు. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు‌గా కనిపించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట ‘ముద్ర’ అనే టైటిల్‌ పెట్టారు. అదే టైటిల్‌‌తో వేరే సినిమా తెరకెక్కడంతో దీన్ని మార్చేశారు. ‘అర్జున్ సురవరం’గా టైటిల్‌ను మార్చిన తరవాత మార్చి 29న విడుదల చేస్తున్నట్లు తొలిసారి ప్రకటించారు. కానీ, విడుదల కాలేదు. అప్పటి నుంచి రకరకాల కారణాల చేత విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఒకానొక దశలో ఇక ఈ సినిమా రానట్టే అని కూడా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది అన్నారు. అయినప్పటికీ, నిఖిల్ మాత్రం నిరుత్సాహపడకుండా తన సినిమాకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా విడుదల తేదీని ఖరారు చేస్తూ ట్వీట్ చేశారు. అంటే, నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ రావడం పక్కా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MQtZKr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....