Wednesday, 24 November 2021

అదిరిపోయే స్టెప్పేసిన సితార.. వీడియో వైరల్! మహేష్ బాబును మించి పోయేలా ఉందే..

గారాలపట్టి చిన్నప్పటి నుంచే ఫుల్ ఫేమస్. సూపర్ స్టార్ వారసురాలిగా, మహేష్- నమత్రల కూతురిగా అతి చిన్న వయసులోనే తన ఆట పాటలతో, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హవా నడిపిస్తుంటుంది. తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ చూపిస్తూ మహేష్ అభిమానులను హుషారెత్తిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో మహర్షి సినిమాలోని ''పాలపిట్ట'' పాటకు డ్యాన్స్‌ చేసి నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సితార.. ఇప్పుడు ఓ వెస్టర్న్ పాటకు చిందేసింది. ఫాస్ట్ బీట్‌తో వస్తున్న ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి వావ్! అనిపించింది సితార. ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న సితార.. ''సోలోగా ట్రై చేశా.. ఇంకోటి చేయమంటారా?'' అని ట్యాగ్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సితారపై ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. ఈ వీడియోలో సితార చాలా యాక్టివ్ పర్‌ఫార్‌మెన్స్ చూపడంతో అప్‌కమింగ్ హీరోయిన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరికొందరైతే ఇంకాస్త ముందడుగేస్తూ సినీ ఇండస్ట్రీకి వస్తే మహేష్ బాబును మించి పోయేలా ఉందే అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ''గ్రేట్ టాలెంట్, ఫ్యూచర్‌ సూపర్‌స్టార్‌'' అనేవాళ్ళనైతే లెక్కపెట్టలేం. మహేష్ కుమార్తెనే అయినా చిన్నతనం నుంచే తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంటూ వస్తోంది సితార. తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటూ చిన్నతనంలోనే యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. అలా ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న ఈ సూపర్ స్టార్ డాటర్ మరికొద్ది రోజుల్లో సినీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్. సితారను గ్రాండ్‌గా లాంచ్ చేసేలా స్కెచ్చేశారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CPEftc

No comments:

Post a Comment

'Bengali Nationalism May Help Mamata Retain Power'

'If the BJP becomes our political identity, our political face, if we are represented by the BJP, then what happens to our identity as B...