బాక్సాఫీస్ బాద్ షా జూనియర్ ఎన్టీఆర్.. బుల్లితెరపై బిగ్ బాస్ షోతో కింగ్ అనిపించారు. బుల్లితెర హిస్టరీలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి హోస్ట్ చేసి అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. తాజాగా రియాలిటీ గేమ్ షో ‘’ ద్వారా మరికొద్ది రోజుల్లో యంగ్ టైగర్ బుల్లితెర సందడి చేయబోతున్నారు. మొదటి ఎపిసోడ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా ఈ సీజన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ తన టైమింగ్‌తో.. ఈ షోని ముందుకు తీసుకుపోతున్నారు. రీసెంట్‌గా ఓ ప్రత్యేక ఎపిసోడ్‌ని కూడా షో నిర్వాహకులు లాంచ్ చేశారు. ఇందులో టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి, కొరటాల శివలు గెస్ట్‌లుగా హాజరు అవుతున్నట్లు చూపించారు. సెప్టెంబర్ 20వ తేదీ (సోమవారం) ప్రసారం కాబోతున్న షో కోసం ఏకంగా రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దించారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ షో ప్రోమో చూసి అంచనాలు తారాస్థాయిలోకి వెళ్లిపోయాయి. తన డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివల విషయంలో కూడా అస్సలు వెనక్కి తగ్గని ఎన్టీఆర్.. ''నేనే బాస్ ఇక్కడ'' అనేశారు. 'లొకేషన్ నాది డైరెక్షన్ నాది' అంటూ వాళ్లకు షాకిచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ సీన్ హైలైట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన మరో వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ షోలో త్వరలో మహేష్‌బాబు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారనే వార్త వినిపిస్తోంది. దసర పండుగ సందర్భంగా వచ్చే ప్రత్యేక ఎపిసోడ్‌లో మహేష్ అతిథిగా రాబోతున్నారు అని సమాచారం. ఈ షోలో పాల్గొనేందుకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూట్ జరగనుందని సమాచారం. గతంలో ‘భరత్ అను నేను’ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ షోలో మహేష్ ముఖ్య అతిథి వస్తున్నారని తెలియడంతో అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఈ షో టెలికాస్ట్ అయితే.. టీఆర్‌పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్లిపోతాయి అంటూ వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nLmR4U
No comments:
Post a Comment