వైవిధ్య భరితమైన కథలకు పెద్ద పీట వేస్తున్నారు నేటితరం ఆడియన్స్. అది చిన్న సినిమానా, లో- బడ్జెట్ మూవీనా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా అనేది పక్కనబెట్టి కంటెంట్ డిఫరెంట్‌గా ఉంటే చాలు హిట్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే '20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య' అంటూ ఇప్పటివరకు గతంలో ఎన్నడూ చూడని కథను ‘సావిత్రి w/o సత్యమూర్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు నూతన దర్శకుడు . ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాస్యనటి , ‘కేరింత’ ఫేమ్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ ఇద్దరూ భార్యా భర్తలుగా కనిపించనున్నారు. చిత్రంలో శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. సంగీతం అందిస్తున్నారు. కామెడీ ప్రధానాంశంగా రాబోతున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తి పెంచేయగా.. తాజా విడుదల చేసిన ట్రైలర్ మరింత క్యూరియాసిటీ నెలకొల్పింది. తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని 60 ఏళ్ల సావిత్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆనవాలుగా 20ఏళ్ల కుర్రాడి ఫొటో ఇచ్చి, అతనే తన భర్త అని చెప్పడంతో పోలీసులు షాక్ కావడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేశారు. ''హీరో ఏజ్ సీక్రెట్ విలువ 50 కోట్లు, నాకు నీలాంటి ఒక బాబు కావాలి, ఒక నైట్ స్టే చేయాలి'' లాంటి డైలాగ్స్ ఈ మూవీలో రొమాంటిక్ డోస్ కూడా దట్టించారని చెబుతున్నాయి. సో.. సినిమా విడుదలైతే గానీ చెప్పలేం 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య సీక్రెట్ ఏంటనేది!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39lC9Vw
No comments:
Post a Comment