Friday, 20 August 2021

Sri reddy: పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే నేను రెడీ.. సీఎం జగన్‌కు పోటీ అంటూ షాకింగ్ కామెంట్స్

బోల్డ్ మాటలతో పిచ్చెక్కించడమే కాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూలతో సంచలనం సృష్టించే ప్రత్యేకించి పవర్ స్టార్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో మనందరికీ తెలుసు. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో టాలీవుడ్‌లో రచ్చ చేసిన ఆమె.. ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా పవన్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుడటం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ ఎన్నో సందర్భాల్లో హైలైట్ అయిన ఈ సంచలన తార.. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ వేదికలకు దూరంగా ఉంటోంది. దీంతో శ్రీ రెడ్డికి ఏం జరిగింది? ఉన్నట్టుండి ఎందుకు సామజిక మాధ్యమాల్లో యాక్టివ్‌నెస్ తగ్గించిందనే దానిపై జోరుగా చర్చలు నడిచాయి. కరోనా బారిన పడిందనే రూమర్లు కూడా షికారు చేశాయి. అయితే తాను సోషల్ మీడియాకు దూరం కావడానికి కరోనా కారణం కాదని, డిప్రెషన్ ఎక్కువైపోవడంతో డాక్టర్‌ని సంప్రదించాల్సి వచ్చిందని, అందుకు ట్రీట్‌మెంట్ తీసుకున్నానని చెప్పిన శ్రీ రెడ్డి.. చెన్నైలో ఇల్లు మారడం, ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నానని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీ రెడ్డి చాలా విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే తాను ఆయనతో కలిసి నటించేందుకు రెడీ అని శ్రీ రెడ్డి చెప్పడం గమనార్హం. ''లైఫ్ లాంగ్ ఒకరిపై కామెంట్స్ చేస్తున్నానంటే వాళ్ళు జీవితాంతం నచ్చరని కాదు. వాళ్ళు పర్సనల్‌గా కూడా శత్రువులే అని అనుకోవడం పొరపాటు. శత్రువు కూడా ఎదురుపడ్డపుడు నమస్కారం పెట్టడం మన సంస్కారం. నచ్చకపోతే ఏ ఒక్కరినీ వదలను కానీ, లైఫ్ లాంగ్ శత్రువులుగా అయితే భావించను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చినా ఆయన సినిమాలో నటిస్తాను'' అని చెప్పింది శ్రీ రెడ్డి. ఇకపోతే వర్క్, ప్రొఫెషనలిజంలో పవన్ కళ్యాణ్ కాస్త పర్వాలేదని చెప్పిన శ్రీ రెడ్డి.. రాజకీయాలు ఆయనకు సూట్ కావనేది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఏమో మార్పు అనేది రావొచ్చేమో, ఒకవేళ అదే జరిగితే భవిష్యత్‌తో మా జగన్ గారికి మంచి కాంపిటేటర్ కావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం రేగుతోంది. కామెంట్ల రూపంలో పెద్ద ఎత్తున నెటిజన్స్ స్పందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AX9sKt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....