Saturday 21 August 2021

Maa Elections:‘ఆ కల త్వరలోనే నిజం అవుతోంది’ మంచు విష్ణు.. లేటెస్ట్ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలోకంటే రంజుగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ రోజు రోజుకీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో , సై అంటే సై అనడానికి రెడీ కాగా.. ‘మా’ కార్యదర్శిగా ఉన్న జీవితా రాజశేఖర్‌ కూడా బరిలో నిలవడంతో మా ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పేట్టు లేదు. ఈ ముగ్గురే అనుకుంటే నేనెందుకు కాకూడదు ‘మా’ ప్రెసిడెంట్.. నాకేం తక్కువ అన్నట్టుగా రంగంలోకి దిగింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఓ ప్రత్యేక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే తన జేబులోంచి డబ్బులు పెట్టి భవంతిని కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ… తన హామీలు ఉత్తవి కావని నిరూపించేందుకు విష్ణు సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ అంశం ఫిలిమ్ నగర్‌లో వైరల్ అవుతోంది. మంచు విష్ణు తాజాగా ఈ బిల్డింగ్ కోసం మూడు స్థలాలు చూశాను అంటూ.. అందులో ఏదీ ఓకే అయితే అది ‘మా’ కోసం తీసుకుంటాను అంటూ ఓ పోస్ట్ చేశారు. త్వరలో అందరం కూర్చొని దీనిపై చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామంటూ మంచు విష్ణు ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మా’కి ఓ బిల్డింగ్ ఉండాలి అనే కల త్వరలో నెరవేరుతుంది అంటూ.. ‘గుడ్ మార్నింగ్ మా ఫ్యామిలీ’ అంటూ ఆయన ఈ ట్వీట్‌కి క్యాప్షన్ పెట్టారు. మరి మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం ‘మా’ ఎన్నికలపై ఏ రేంజ్‌లో ప్రభావం చూపుతుందో భవిష్యత్తులో తెలుస్తోంది. మంచు విష్ణు నిజంగానే ‘మా’ కోసం భవనం కడతారా.. లేదా ఇది కేవలం ఎన్నికల కోసమేనా అని తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3go1l1w

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6