Saturday 21 August 2021

‘ఓటీటీ’లలో విడుదలపై కొనసాగుతున్న రచ్చ.. తెలంగాణ సినిమా థియేటర్ల సంఘం కీలక నిర్ణయం

నాచురల్ స్టార్ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌‌’. శివ నిర్వాణ దర్శకుడు. రితు వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చాలాకాలం క్రితమే ఈ సినిమా విడుదల కావాలి. కానీ.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ భయంకరంగా వ్యాపించడం.. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఈ సినిమా విడుదల వాయిదాపడింది. కానీ, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విడుదలపై చాలాకాలంగా సందిగ్ఘత నెలకొంది. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే ఆ ఎదురుచూపులకు ఫు‌ల్‌స్టాప్ పెడుతూ.. సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే దీనిపై థియేటర్ల యాజమాన్యం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే.. ఆ తర్వాత విడుదల అయ్యే నాని సినిమాలను థియేటర్లలో విడుదలు చేయము అంటూ థియేటర్ యాజమాన్యాలు ప్రకటించారు. అయితే తాజాగా ఈ విషయంపై తెలంగాణ థియేటర్ల సంఘం వివరణ ఇచ్చింది. తాజాగా తమ సంఘం దీనిపై సమావేశం అయిందని.. అయితే తమ సెక్రటరీ సినిమాను వాయిదా వేయాలో.. లేక విడుదల తేదీని వాయిదా వేసుకోవాలనే కోరారు అని.. అంతే కానీ, తాము ఎవరికి వ్యతిరేకం కాదని.. స్పష్టం చేసింది. ‘టక్‌ జగదీష్’ సినిమాతో ఎన్నో అంచనాలు ఉన్నాయి అని.. అయితే అది ఓటీటీలో విడుదల చేయడం బాధ కలిగించింది కానీ, ఎవరిని వేధించాలనో లేదా వేరే ఉద్దేశం లేదని థియేటర్‌ల సంఘం పేర్కొంది. ఒకవేళ తమ ఎగ్జిబిటర్ల వల్ల ఎవరైన హర్ట్ అయి ఉంటే దయచేసి క్షమించాలి అంటే వాళ్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D8NGVM

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6