Thursday, 26 August 2021

‘మాహానటి’ కీర్తి సురేష్ కొత్త అడుగు.. అందాన్ని కాపాడటం కోసం మాస్టర్ ప్లాన్

‘బయోపిక్’.. ఎవరైనా ఓ ప్రముఖ వ్యక్తి జీవితగాధను ఆధారంగా చేసుకొని.. తెరకెక్కించే చిత్రం. చాలా ఏళ్లుగా దాదాపు అన్ని ఇండస్ట్రీలో ఈ జానర్‌లో సినిమాలు వస్తున్నాయి. అయితే అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సినిమాలు మాత్రం ప్రజల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోయాయి. అందులో ప్రధానంగా ‘భాగ్ మిల్కా భాగ్’, ‘ఎంఎస్ ధోనీ, ‘మేరీ కోమ్’ తదితర చిత్రాలు సూపర్‌హిట్లు కావడమే కాదు.. ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటులు.. అందులో నటించలేదు.. జీవించారు అంటూ ప్రేక్షకులు కితాబు ఇచ్చారు. అలా ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోయిన సినిమాల్లో ‘మహానటి’ ఒకటి. అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. నిజానికి సావిత్రి పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారనే చెప్పుకోవాలి. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. పలు జాతీయ అవార్డులు కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. కీర్తి సురేష్ ఇప్పుడు తన జీవితంలో ఓ ముందడుగు వేయనున్నారు. అదేంటంటే ఆమె వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి భూమిత్ర బ్రాండ్‌ పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఔషదాలతో తయారు చేసిన స్కీన్‌కేర్ ఉత్పత్తులు ఇవి కీర్తీ సురేష్ స్పష్టం చేశారు. అందాన్ని మెరుగుపరిచేలా.. సహజ సిద్ధంగా ఉండే సౌందర్యం అనిపించేలా వీటిని తయారు చేస్తున్నామన్నారు ఆమె. ఇక సినిమా విషయానికొస్తే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘’ సినిమాలో హీరోయిన్, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘’ సినిమాలో ఆయనకు సోదరిగా నటిస్తున్నారు కీర్తి. దీంతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఆమె సినిమాలో చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38ih3Hf

No comments:

Post a Comment

'We want to grow better than industry'

'Health and motor insurance will continue to be our two most important segments' from rediff Top Interviews https://ift.tt/qm8AQOC...