Thursday, 26 August 2021

నా అభిప్రాయం నాది.. టైం వస్తే అన్నీ చెబుతా! అక్కినేని అనే పదం తొలగించడంపై సమంత రియాక్షన్

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. పెళ్లికి ముందే స్టార్ స్టేటస్ పట్టేసి ఆ తర్వాత అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టింది. నాగార్జున తనయుడు నాగ చైతన్యను పెళ్లాడిన ఆమె.. మ్యారేజ్ తర్వాత మరింత జోష్‌లో సినిమాలు చేస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉండే సామ్, ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో అక్కినేని అనే పదాన్ని తొలగించడం చర్చనీయాంశం అయింది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత తన ప్రొఫైల్‌ నేమ్‌ను అక్కినేని సమంతగా మార్చుకున్న సామ్.. కొన్ని రోజుల క్రితం ఆ పేరులోంచి అక్కినేని అనే పదంతో పాటు సమంతను కూడా తొలగించి కేవలం 'S' అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. దీంతో సమంత కుటుంబంలో ఏమైనా క్లాషెస్ వచ్చాయా? ఉన్నట్టుండి ఇలా అక్కినేని పదాన్ని ఎందుకు రిమూవ్ చేసింది అనే దానిపై జోరుగా చర్చలు నడిచాయి. మరోవైపు ఇష్యూపై వరుస కథనాలు కూడా రావడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తొలిసారి సమంత ఈ విషయంపై ఓపెన్ అయింది. తన పేరులో చేసిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చుట్టూ వివాదాలంటూ విపిస్తున్న వార్తల గురించి తనకు నచ్చినప్పుడే మాట్లాడతానని, ఊహలన్నీ వదంతులే అని చెప్పుకొచ్చింది. ''అయినా నేను వదంతులకు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడూ అంతే. నా అభిప్రాయం నాది'' అని సమంత పేర్కొంది. ఇకపోతే రీసెంట్‌గా 'శాకుంతలం' సినిమా పూర్తి చేసిన సమంత, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటానని చెప్పడం కొత్త చర్చలకు తెరలేపింది. కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్ర పోషించిన సామ్, 'శాకుంతలం' సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకుందట. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Dt9g7Z

No comments:

Post a Comment

'No Plan To Phase Out Old I-T Regime'

'Going forward, the encouragement would be to move to the new tax regime.' from rediff Top Interviews https://ift.tt/ZqrBWh3