Monday, 22 March 2021

అద్దం ముందు దుస్తులు మార్చుకుంటూ సమంత.. వీడియోతో అసలు విషయం చెప్పేసిన అక్కినేని కోడలు

అక్కినేని కోడలు కాకముందే సమంతకు స్టార్ స్టేటస్ ఉంది. అయితే నాగ చైతన్యను పెళ్లాడాక అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది. అందుకు తగ్గట్టు అక్కినేని వారింట అడుగుపెట్టాక జోష్ కూడా మరింత పెంచేసింది. ఓ వైపు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటూనే మరోవైపు వ్యాపార రంగం లోనూ రాణిస్తోంది. మోడ్రన్ కల్చర్‌కి యాప్ట్ అయ్యేలా వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్తగా బిజినెస్ ప్లాన్స్ చేస్తూ తన లోని మరో కోణాన్ని బయటపెడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునికతను క్యాష్ చేసుకునేలా సమంత ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ స్టార్ట్ చేసింది. '' పేరుతో తన కలల ప్రపంచాన్ని జనం ముందుకు తెచ్చింది. రీసెంట్‌గా మొదలైన ఈ వ్యాపారం సమంతకు మంచి లాభాలు తెచ్చిపెడుతోందట. సామ్ స్టోర్ కావడంతో జనం ఫుల్ అట్రాక్ట్ అవుతుండటం బాగా కలిసొస్తోంది. ఆన్‌లైన్ స్టోర్ కావడంతో దేశంలోని పబ్లిక్ మాత్రమే కాదు విదేశాల జనం సైతం ఆర్డర్స్ ఇస్తున్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది సమంత. ఈ విషయం తెలుసా..? ''సాకీ స్టోర్ దుస్తులను అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా పంపిస్తున్నాం'' అని పేర్కొంటూ పోస్ట్ పెట్టింది సామ్. ఈ మేరకు ఆమె ట్యాగ్ చేసిన వీడియోలో అద్దం ముందు నిలబడి చకచకా దుస్తులు మార్చుకుంటూ కనిపించింది సామ్. మోడ్రన్ జనాన్ని ఆకర్షించేలా తన బ్రాండ్‌ని తానే ప్రమోట్ చేసుకుంటూ చిందేసింది ఈ బ్యూటీ. దీంతో 'ఎంతైనా అక్కినేని కోడలు కదా! ఆ బిజినెస్ ఆలోచనలు అలాగే ఉంటాయిలే' అని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ వీడియోకు లైకులైతే లక్షల్లోనే వస్తుండటం గమనార్హం. సమంత కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు సెలక్ట్ చేసుకుంటోంది ఈ అందాల తార. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమాలో నటిస్తోంది. సమంత మొదటిసారి పౌరాణిక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అతిత్వరలో ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c867P5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....