Saturday, 2 January 2021

Psycho Varma: ఆర్జీవీపై రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ అదిరింది.. నీ వరసేందిరో ఓ వోడ్కా వీరుడా అంటూ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీస్తోన్న చిత్రం ‘సైకో వర్మ’ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'వీడు తేడా' అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను నట్టి కుమార్ రూపొందిస్తున్నారు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు చిత్రాలను నిర్మించిన తన కొడుకు, నిర్మాత నట్టి క్రాంతిని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు. కృష్ణ ప్రియ, సంపూర్ణ మలకర్ హీరోయిన్లు. కాగా ఈ చిత్రంలో పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేశారు. ''నీ వరసేందిరో ఓ వోడ్కా వీరుడా..! నీ వాగుడేందిరో ఓ సైకో సూర్యుడా'' అంటూ సాగిపోతున్న ఈ పాట ఆర్జీవీ లక్షణాలను అద్దం పడుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ.. ''సైకో వర్మ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి' అంటూ సాగే లిరికల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సింగర్స్‌కి, డైరెక్టర్‌కి ఈ పాట మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్నాడు. తను చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి నాకు చాలా మంది ఫోన్ చేశారు. సింగిల్ టేక్‌లో డాన్స్ పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. పాటకు తగ్గట్టు డాన్స్, పాటకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా మంచి విషయం. నటనలోని మెలకువలు తెలుసుకుంటూ నట్టి క్రాంతి ఇంకా మంచి మంచి అవకాశాలతో ముందుకెళ్లాలి. రాహుల్ సిప్లిగంజ్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. గతంలో మేము ఒక సాంగ్ మేకింగ్ వదిలాము. ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేస్తున్నాము. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు. ఈ సైకో వర్మ సినిమాలో అప్పాజి, మీనా, రూపలక్ష్మి, చమ్మక్ చంద్ర, కబుర్లు నవ్యా, రమ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rLUBPf

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....