Tuesday, 5 January 2021

Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. పక్కా, ప్రామిస్ చేస్తున్నానంటూ రాధేశ్యామ్ డైరెక్టర్ ట్వీట్

'సాహో' మూవీ తర్వాత తదుపరి సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ''. చాలారోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో సినిమా టీజర్, ట్రైలర్ ఎప్పుడెప్పుడొస్తుందా అనే కుతూహలం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేస్తారని వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. కనీసం టీజర్‌ విడుదలకు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో అందరినీ కూల్ చేస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. 'టీజర్ అప్‌డేట్‌ రాబోతోంది గైస్. అప్పటి వరకు ఓపికగా వేచి ఉండండి. ప్రామిస్ చేస్తున్నా.. మీ ఎదురు చూపులకు ఫలితం ఉంటుంది. లక్షల నవ్వుల సంతోషాన్ని తీసుకొస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. సో.. టీజర్ విడుదలైతే ఆ హంగామా ఎలా ఉంటుందనేది చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/391JpFB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....