Sunday, 24 January 2021

Mahesh Babu: 'సర్కారు వారి పాట' మొదలు.. ఆదిలోనే సూపర్ స్టార్ ప్రభంజనం.. ప్రపంచ రికార్డు

వరుసగా ''భరత్ అనే నేను, మహర్షి'' సినిమాలతో సత్తా చాటిన సూపర్ స్టార్ 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో '' అంటూ మరో వైవిద్యభరితమైన కథను ఓకే చేసిన మహేష్.. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో 'సర్కారు వారి పాట' మోత మోగిస్తూ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. అదేనండీ.. సూపర్ స్టార్ సినిమా వస్తుందంటేనే పండగ చేసుకునే ఫ్యాన్స్, హ్యాట్రిక్ విజయాల తర్వాత మహేష్ రంగంలోకి దిగుతుంటే ఊరుకుంటారా? ట్విట్టర్‌లో 'సర్కారు వారి పాట' హ్యాష్ ట్యాగ్‌తో రచ్చ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా మోత మోగిస్తున్నారు. #SarkaruVaariPaata అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ వరుస ట్వీట్స్ చేస్తుండటంతో ఈ సినిమా నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. దీంతో ఏకంగా వంద మిలియన్లకు పైగా ఉపయోగించబడిన హ్యాష్ ట్యాగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా గతంలో ఏ పరిశ్రమకు చెందిన సినిమా కూడా ఈ మైలురాయిని అందుకోకపోవడం, మొదటిసారి మహేష్ ఖాతాలోనే ఈ ప్రభంజనం చోటు చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ రోజే (జనవరి 25) ఈ 'సర్కారు వారి పాట' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దుబాయ్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ పాల్గొంటోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ 'షూట్ బిగిన్స్' వీడియో షేర్ చేశారు మేకర్స్. మరోవైపు ఇప్పటినుంచే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కోట్లలో జరుగుతోందని తెలుస్తుండటం ఈ మూవీపై ఉన్న అంచనాలకు అద్దం పడుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YojYJD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....