Tuesday, 26 January 2021

‘ఉప్పెన’ విడుదల తేదీ ఖరారు.. వెండితెరపై మెరవనున్న మరో మెగా హీరో

మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వెండితెరపై మెరవబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు, సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయవుతున్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టింది. ఈ ఒక్క పాటతో ‘ఉప్పెన’కు బోలెడంత ప్రచారం దక్కింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు వేచిచూస్తున్నారు. మొత్తానికి విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఫిబ్రవ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లోకి రానుంది. సంగీతంలో త‌న‌ అభిరుచి, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించ‌డంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందించారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవ‌ల విడుదలైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన ల‌భించింది. వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి తమ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆక‌ట్టుకున్నారు. ఈ టీజ‌ర్‌తో ‘ఉప్పెన‌’పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iUBaQb

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...