Tuesday, 26 January 2021

కొరటాల శివకు చిరంజీవి వార్నింగ్.. దెబ్బకు దిగొచ్చిన స్టార్ డైరెక్టర్!!

అభిమానులకు మెగాస్టార్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఆచార్య’ టీజర్ గురించి చిరంజీవి కీలక ప్రకటన చేశారు. టీజర్ ఎప్పుడు వచ్చేది రేపు ఉదయం 10 గంటలకు తెలుస్తుందని వెల్లడించారు. అయితే, ఈ ప్రకటన తనదైన శైలిలో ఇచ్చారు మెగాస్టార్. ఆలస్యంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. దాన్ని వాడటం మొదలుపెట్టాక తన కన్నా ఎవరూ బాగా వాడలేరు అన్నట్టుగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పటికే తన ట్వీట్లతో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఈరోజు ‘ఆచార్య’ టీజర్ కోసం చేసిన ట్వీట్‌తో కూడా ఔరా అనిపించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ‘‘ఈరోజు కొరటాల శివతో చాలా సీరియస్‌గా చర్చించాను. 6.30కు అప్‌డేట్ ఇస్తాను’’ అని మంగళవారం సాయంత్రం చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా ‘ఆచార్య’ టీజర్ కోసమే అని మెగా అభిమానులు ఊహించారు. ఇది నిజమే అయినప్పటికీ చిరంజీవి చేసిన ప్రకటన ‘బాస్ స్టైలే వేరు’ అనిపిస్తోంది. కొరటాల శివతో జరిగిన చర్చకు సంబంధించిన ఫొటోలతో వారి మధ్య జరిగిన కాన్వర్జేషన్‌ను అక్షరాల రూపంలో అందించారు చిరంజీవి. చిరంజీవి: ఏమయ్యా కొరటాల.. ‘ఆచార్య’ టీజర్ న్యూ ఇయర్‌కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు... కొరటాల శివ: సర్, అదే పనిలో ఉన్నా! చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా.. కొరటాల శివ: రేపు ఉదయమే అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తా సర్! చిరంజీవి: ఇస్తావుగా.. కొరటాల శివ: అనౌన్స్‌మెంట్ రేపు మార్నింగ్ 10 గంటలకు ఫిక్స్ సర్! ఈ విధంగా టీజర్ అనౌన్స్‌మెంట్ తేదీని వెరైటీగా ప్రకటించారు చిరంజీవి. ఈ ఆలోచన ఎవరిదో తెలీదు కానీ చాలా కొత్తగా అనిపించడంతో ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే 7వేల మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 21వేల లైకులు, 14 వందల కామెంట్లు. కాగా, ‘ఆచార్య’లో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే, రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో మెరవనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cpRbwv

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk