Sunday, 3 January 2021

‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్: హీరోని మార్చిన సెల్వరాఘవన్.. తమ్ముడికి ఛాన్స్!

వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సెల్వ రాఘవన్ మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో పదేళ్ల క్రితం ‘ఆయిరతిళ్ ఒరువన్’ అనే సినిమా వచ్చింది. కార్తి హీరోగా ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా అనువాదమై విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. ఇప్పుడు దశాబ్ద కాలం తరవాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ మేరకు దర్శకుడు సెల్వరాఘవన్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో హీరో కార్తి కాదు. తన తమ్ముడు, స్టార్ హీరో ధనుష్‌‌ను కథానాయకుడిగా తీసుకున్నారు సెల్వరాఘవన్. కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా సెల్వరాఘవన్ ‘ఆయిరతిళ్ ఒరువన్’ సీక్వెల్‌ను, హీరోను ప్రకటించారు. అంతేకాదు టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘అద్భుతమైన సినిమా. ప్రీ ప్రొడక్షన్‌కే ఏడాది సమయం పడుతుంది. మాస్టర్ సెల్వరాఘవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా రూపొందించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఆయిరతిళ్ ఒరువన్ 2.. 2024లో రాజకుమారుడు వస్తాడు’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, సినిమాలో తన లుక్‌తో కూడిన ఇలస్ట్రేషన్ పోస్టర్‌ను ధనుష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KZv3O3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....