ఇటీవలే మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందని చెప్పిన వెంటనే మెగా ప్రిన్స్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని పేర్కొనడంతో మెగా అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా తాను కరోనా నుంచి బయటపడ్డానని, రిపోర్ట్‌లో కరోనా నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వరుణ్ తేజ్. ''నా జీవితం మొత్తంలో ఓ రిపోర్ట్‌లో నెగెటివ్ అనే పదం ఇంత ఆనందాన్నిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నాకు కరోనా నెగెటివ్ అని తేలింది. మీ ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు'' అని తెలుపుతూ ట్వీట్ చేశారు వరుణ్ తేజ్. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెట్టింపు జోష్‌లో సినిమాలు చేసేయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచే వైవిద్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ఇటీవలే 'గద్దలకొండ గణేష్' రూపంలో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ మూవీలో నటిస్తూనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వచ్చేశారు వరుణ్. దిల్ రాజు నిర్మాణంలో F2కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35hZ6r8
No comments:
Post a Comment