Wednesday, 6 January 2021

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన మాళవిక శర్మ.. నా వరకైతే ఇదే జరిగిందంటూ ఓపెన్

రవితేజ సరసన నటించి 'నేల టిక్కెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక శర్మ. చూపుతిప్పుకోలేని అందంతో అట్రాక్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి రామ్‌తో కలిసి థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. రామ్- జంటగా నటించిన '' మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మాళవిక సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. గత కొన్నేళ్లుగా కాస్టింగ్ కౌచ్ భూతం సినీ రంగాన్ని వెంటాడుతూనే ఉంది. అడపాదడపా ఎవరో ఒకరు మీడియా ముందుకొచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. కొందరు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కారణంగా మోసపోయామని ఓపెన్ అవుతుండగా మరికొందరు తారలు ఇండస్ట్రీలో అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయమై హీరోయిన్ మాళవిక శర్మను ప్రశ్నించగా.. తనకైతే అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని చెప్పింది. ఇతరులకు ఎదురైందా? ఇంతకీ ఇండస్ట్రీలో అనే దానిపై తాను ఏమీ చెప్పలేనని పేర్కొంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'రెడ్' సినిమాలో హీరో రామ్‌తో పాటు హీరోయిన్ మాళవికను ఎంతో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారని తెలుస్తోంది. ఈ మూవీలో సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని, థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఇన్నాళ్లూ ఎదురు చూసిన దర్శకనిర్మాతలు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3949OCG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....