Wednesday, 6 January 2021

తల్లి పర్మిషన్‌తో శుభకార్యానికి రెడీ అయిన మోనాల్.. త్వరలోనే బిగ్ బాస్ ఫ్యామిలీకి గ్రాండ్ పార్టీ!!

గుజరాతీ బ్యూటీ గురించి చెప్పుకోవాలంటే బిగ్ బాస్‌కి ముందు, బిగ్ బాస్ తరువాత అనే మొదలుపెట్టాలి. ఎందుకంటే చాలా రోజుల క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. బిగ్ బాస్ సీజన్- 4 లో అడుగుపెట్టాక ఓ రేంజ్ క్రేజ్ కొట్టేసింది. హౌస్‌లో అందాల భామగా బుల్లితెర ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తల్లి పర్మిషన్‌తో కీలక నిర్ణయం తీసుకుందట మోనాల్. సినిమా అవకాశాలతో పాటు టీవీ షోస్, వెబ్ సిరీసుల రూపంలో ఆఫర్స్ అందుకుంటోంది. పైగా ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ రెమ్మ్యూనరేషన్స్ ఇస్తున్నారట దర్శకనిర్మాతలు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే కోణంలో ఆలోచించి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యేలా మోనాల్ అడుగులేస్తోందట. ఈ నేపథ్యంలోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇల్లు కొనే పనిలో పడిన ఆమె ఇప్పటికే హౌస్ కొనుగోలు డీల్ పూర్తిచేసిందని టాక్. Also Read: ప్రస్తుతం తన సొంత ఊరిలో ఉంటున్న మోనాల్.. అతి త్వరలో కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి గృహ ప్రవేశం చేయనుందని సమాచారం. ఇక ఈ శుభ కార్యానికి అత్యంత సన్నిహితులతో పాటు బిగ్ బాస్ ఫ్యామిలీని ఆహ్వానించి గ్రాండ్ పార్టీ ఇవ్వాలని అనుకుంటోందట మోనాల్. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేసింది ఈ బ్యూటీ. అలాగే మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. సో.. చూడాలి మరి ఫ్యూచర్‌లో మోనాల్ ఇంకెంత హంగామా చేస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38nw4bm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....