Wednesday, 20 January 2021

మహేష్ బాబు ఫిట్‌నెస్ మంత్ర.. సరిహద్దులు చెరిపేయండి.. ఎక్కడా ఆగొద్దంటూ సూపర్ స్టార్ పోస్ట్

సూపర్ స్టార్ అందం, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. సినిమా సినిమాకు ఆయన లుక్ మరింత క్రేజీగా మారడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న హీరోల్లోకెల్లా గ్లామర్ పరంగా మహేష్‌ని మించిన హీరోనే లేడని చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్‌నెస్‌తో హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటారాయన. టాలీవుడ్ అత్యంత అందగాడిగా లేడీ అభిమానుల మనసు దోచుకుంటున్న ఈ హీరో.. తన ఫిట్‌నెస్ విషయమై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు. ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా మరో వీడియోతో తన ఫిట్‌నెస్ మంత్ర ఇదేనని చెప్పకనే చెప్పేశారు మహేష్. ఆ మ‌ధ్య న‌మ్ర‌త త‌న భ‌ర్త మ‌హేష్ బాబు‌కు మాస్ట‌ర్స్ డెన్ అనే జిమ్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన ఇంట్లో లేడంటే ఎక్కడుంటారనేది అంటూ జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న వీడియోని ఆమె షేర్ చేశారు. ఫిట్‌నెస్ కోసం ఈ జిమ్‌లోనే మహేష్ చాలా శ్రమిస్తాడని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మహేష్ `బాక్స్ జంప్స్` చేస్తూ కనిపించారు. మీ ఆటను మరింత పెంచండి. సరిహద్దులు చెరిపేయండి. ఎక్కడా ఆగొద్దంటూ ఈ వీడియోపై మహేష్ కామెంట్ పెట్టారు. దీంతో ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తూ మహేష్ ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం 'సర్కారు వాటి పాట' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అతిత్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XZ4Emm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....