Friday, 8 January 2021

గురూజీ మొదలెట్టారు.. అద్భుతమైన పదాలు జీవితంలో భాగం కాబోతున్నాయి: కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

సినిమాలు తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉంటుందని నిరూపించుకున్నారు డైరెక్టర్ . ఆయన సినిమా వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు చూసేయాలా అనే ఆతృత జనాల్లో మొదలవుతుంది. అయితే ఇటీవలి కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు '' అంటూ మరో ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఇస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు కృష్ణవంశీ. రంగమార్తాండ సినిమా కోసం సుప్రసిద్ధ గేయ రచయిత పాటలు రాయడం స్టార్ట్‌ చేశారని తెలుపుతూ ట్వీట్ పెట్టారు కృష్ణవంశీ. ''రంగమార్తాండ.. గురూజీ మొదలెట్టారు.. అద్భుతమైన పదాలు జీవితంలో భాగం కాబోతున్నాయి'' అని పేర్కొంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఫోటో షేర్ చేశారు. దీంతో ఆయన షేర్‌ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''సరస్వతి వీణ శృతి చేస్తున్నట్టు ఉంది, సరస్వతి పుత్రుడు సిరివెన్నెల పాటల కోసం ఎదురు చూస్తున్నాం'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 'నటసామ్రాట్' అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ ఈ 'రంగమార్తాండ' మూవీ. కృష్ణవంశీ రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తోంది. ఓ స్పెషల్ రోల్ కోసం యాంకర్ అనసూయను తీసుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అండ్ మధు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XCdXZr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....