Saturday, 17 October 2020

Rana Daggubati: రానా- మిహీక హనీమూన్ ట్రిప్.. బీచ్‌లో గట్టిగానే చిల్ అవుతున్నారే! ఎలా పడుకున్నారో చూడండి!!

నవ దంపతులు దగ్గుబాటి రానా- మ్యారేజ్ లైఫ్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ లభించిందని పేర్కొంటూ ప్రేయసి మిహీక బజాజ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రానా.. లాక్‌డౌన్ వేళ ఆగస్టు 8వ తేదీన ఆమె మెడలో మూడు ముళ్ళేసి భార్యగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కరోనా కారణంగా ఇన్నిరోజులు ఇంట్లోనే ఉన్న ఈ జోడీ.. ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌లో చిల్ అవుతున్నారు. స్వేచ్ఛగా బయటకు వెళ్లి తమకిష్టమైన ప్రదేశాల్లో షికార్లు కొడుతున్నారు. పెళ్లయిన వెంటనే మిహికాతో విదేశీ ట్రిప్ వేయాలనుకున్న రానాకు కరోనా బ్రేకులు వేసింది. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలులో ఉండటంతో తమ జాలీ ట్రిప్ వాయిదా వేసుకున్న ఆయన.. కాస్త వెసులుబాటు లభించడంతో ఇప్పుడు ఆ పని కానిస్తున్నారు. మిహాకతో కలిసి విదేశీ ట్రిప్ వేసిన దగ్గుబాటి వారసుడు అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే మిహికా ఆ ఫోటోలను షేర్ చేస్తుండటంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే తాజాగా మిహికా షేర్ చేసిన ఓ పిక్ ఆన్‌లైన్ సునామీ సృష్టిస్తోంది. అందుకు కారణం రానా- మిహికా జోడీ ఇద్దరూ బీచ్ ఒడ్డున హాయిగా సేదతీరుతూ కనిపించడమే. బీచ్‌లో అలా పడుకుని ఏదో ముచ్చటిస్తున్న తన సతీమణి మిహికాను సెల్ఫీలో బంధించారు రానా. ఇక ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన మిహీక.. రానా కోసమే ఇలా అన్నట్లుగా హాట్ కామెంట్ జోడించింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట చేస్తున్న హంగామా అంతా ఇంతా అని చెప్పలేని పరిస్థితి. ఇకపోతే రానాను ప్రేమించి పెళ్లాడిన మిహీక ఆయనపై మరింత ప్రేమ పెంచుకొని పెళ్ళైన వారానికే.. ''నా ప్రేమ, నా జీవితం, నా ఆత్మ అంతా నువ్వే. నా జీవితంలో పూర్తి భాగమై నా లైఫ్‌కు అర్థం చేకూర్చినందుకు థ్యాంక్స్. నా వ్యక్తిగత జీవితంలో కూడా సంపూర్ణమైన వ్యక్తిగా చేసింది నువ్వే.. లవ్ యూ'' అంటూ ప్రేమ కురిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు రానా- మిహీక జోడీ టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్‌గా ఫుల్ క్రేజ్ కొట్టేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lVm8tF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....