Saturday, 10 October 2020

Manchu Lakshmi: మంచు లక్ష్మితో రకుల్ నైట్ పార్టీ.. ఘాటు హగ్గులు.. అబ్బో! డాబాపై ఆ సీన్లు చూస్తే..

టాలీవుడ్ హీరోహీరోయిన్లలో కొందరి స్నేహబంధం చాలా ప్రత్యేకమైంది. అందులో ఒకటే మంచు లక్ష్మితో రకుల్ ప్రీత్ ఫ్రెండ్‌షిప్. వయసు పరంగా చాలా తేడా ఉన్నప్పటికీ ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, చెప్పలేనంత ప్రేమ. అందుకే పార్టీలు, టూర్స్, హాలిడే ట్రిప్స్ ఎక్కడైనా ఈ జోడీ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నైట్ పార్టీలో మంచు లక్ష్మితో రకుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న (అక్టోబర్ 10) రకుల్ ప్రీత్ 30వ పుట్టినరోజు. మూడు పదుల వయసులో అడుగుపెట్టిన ఆమెకు స్పెషల్‌గా విషెస్ తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో మంచు లక్ష్మిని ఆప్యాయంగా వెనకనుంచి రకుల్ హత్తుకోవడం చూస్తుంటే.. ఆ ఇద్దరి అనుబంధం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇక డాబాపై అక్కడి వాతావరణం చూస్తుంటే రకుల్ పుట్టిన రోజు సందర్భంగా మంచు లక్ష్మి తన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది. Also Read: రకుల్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి ఇలా ఎంజాయ్ చేశారని ఫిలిం నగర్ టాక్. కాగా ఈ నైట్ పార్టీ వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మి.. రకుల్‌కి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పింది. 'నిజాయితీ గల హార్డ్ వర్కర్, ఫన్, కేరింగ్, మ్యాడ్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్ డే మై లవ్. నువ్వు ఎవరి లైఫ్‌ని టచ్ చేసినా హ్యాపీగా ఉంటారు' అంటూ ఆమెపై ప్రేమను కురిపించింది. దీనిపై రియాక్ట్ అయిన రకుల్.. 'లవ్యూ.. నువ్వు నా సోదరి. నా సోల్. నువ్వు నాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చీర్స్..' అని తెలిపింది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో మైమరిపిస్తున్న .. ప్రస్తుతం నితిన్ సరసన 'చెక్' సినిమాలో నటిస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది రకుల్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SNGSqE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....