Saturday, 17 October 2020

‘మీకు స్వాగతం పలుకుతున్నాం’: కీర్తి సురేష్‌ను సర్‌ప్రైజ్ చేసిన మహేష్

మహానటి’ సినిమాతో శిఖరస్థాయి ఇమేజ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రిని మరిపిస్తూ ఆమె చూపించిన అభినయం ప్రేక్షకుల మనసులను దోచుకుని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్న కీర్తి.. ప్రస్తుతం స్టార్ హీరోలకే ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ పుట్టినరోజు నేడు. Also Read: ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన కో స్టార్‌కు సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్‌ వారి పాట’ టీమ్ మీకు ఫారిన్‌ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్‌‌బాబు ట్వీట్‌ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j4PYdt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....