Sunday, 11 October 2020

అల్లూరి-భీమ్‌ కలుస్తారు కానీ అందుకోసం కాదు.. ‘ఆర్ఆర్ఆర్’లో అదే ట్విస్ట్

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘’. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. అలియాభట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. డీవీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి షెడ్యూల్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా టైటిల్ లోగోతో తయారుచేసిన ఓ నాణెం లాంటి లుక్‌ను సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. Also Read: దీంట్లో భీమ్‌.. అల్లూరి ఏదో గొప్ప పనికోసం చేతులు కలిపినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘ఈ సినిమా.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిసి స్వాతంత్య్రం కోసం పోరాడారని చెబుతుందా?’ అని ప్రశ్నించాడు. ఈ సినిమా దేశభక్తికి సంబంధించినదే కాదంటూ అసలు విషయం చెప్పింది యూనిట్. వాళ్లిద్దరూ చేతులు కలుపుతారని, కానీ దేశ స్వాతంత్య పోరాటం కోసం మాత్రం కాదని వెల్లడించింది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తిగా కల్పిత కథతో తెరకెక్కుతోందని, చరిత్రను ఎక్కడా వక్రీకరించడం లేదంటూ ఆ నెటిజన్‌కు చిత్ర యూనిట్ సమాధానమిచ్చింది. దీంతో అసలు అల్లూరి, భీమ్ ఏ పని కోసం చేతులు కలుపుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SIj4ES

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....