
నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల . ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ కొట్టినా ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. అయితే రామ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిధి కెరీర్‌నే మార్చేసింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనలో మరో హీరోయిన్ నభా నటేష్‌తో పోటీ పడి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఆ ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో శింబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ అమ్మడిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. Also Read: ఇక అసలు విషయానికొస్తే.. నిధి అగర్వాల్ కొంతకాలంగా ఓ హీరోగా ప్రేమలో ఉందని, అతడితో డేటింగ్ కూడా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీని ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. దీంతో కొన్నాళ్లుగా తనపై వస్తున్న రూమర్లకు నిధి చెక్ పెట్టేసింది. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31vjL9e
No comments:
Post a Comment