
తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఒకే జిల్లా ఒకే ప్రాంతం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అందులో ఒకటైన ‘’ సినిమా విడుదలై నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. 1980 అక్టోబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇద్దరి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు గుర్తు చేసుకుందాం... Also Read: హిందీలో సూపర్ హిట్ అయిన 'ముఖద్దర్ కా సికందర్' కథను తెలుగులో ‘ప్రేమ తరంగాలు’ పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తండ్రి రాయపరాజు 'ప్రభుచిత్ర' బ్యానర్‌పై నిర్మించగా.. యస్.పి. చిట్టిబాబు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ పాత్రను కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. హిందీలో రాఖీ చేసిన పాత్రలో సుజాత నటించారు. ఇక రేఖ పాత్రలో జయసుధ, అంజాద్ ఖాన్ పాత్రలో సత్యనారాయణ మెరిశారు. Also Read: 'ప్రేమ తరంగాలు' చిత్రానికి గొల్లపూడి మాటలు రాయగా, సినారె, ఆత్రేయ పాటలు రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఆ కాలంలో ప్రేమ తరంగాలు సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుల్లోని పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఎమ్మెస్ రాజు తండ్రి రాయపరాజు కృష్ణంరాజుతో రీమేక్ గా ‘ప్రేమతరంగాలు’ తెరకెక్కిస్తే.. ఆయన కుమారుడు ఎమ్మెస్ రాజు.. కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్ తో ఎమ్మెస్ రాజు ‘వర్షం’ తెరకెక్కించారు. ఈ సినిమా హిందీలో ‘బాఘీ’ పేరుతో రీమేక్ అయింది. తండ్రి హిందీ సినిమాతో రీమేక్‌గా ఓ స్టార్‌తో తెరకెక్కిస్తే... వాళ్ల వారసులు తీసిన తెలుగు సినిమా హిందీలో రీమేక్ కావడం విశేషమే మరి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31yRVZB
No comments:
Post a Comment