
మూడో పెళ్లి వ్యవహారంతో దక్షిణాది నటి మరోసారి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. మూడో భర్తను తన్ని ఇంట్లో తరిమేసిందంటూ వనితపై ప్రచారం జరగడంతో వనతి స్పందిస్తూ.. అసలు విషయాన్ని ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అందులో మూడో భర్తను పీటర్‌ను తాను ఎంతలా ప్రేమించిందీ, అన్నీ మరచి తాగుడుకు బానిసైన అతడు తనను ఎలా వేధించాడో వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. తన పర్సనల్ విషయాన్ని కొందరు సోషల్‌మీడియాలో పెట్టి వేధించడం సరికాదని హితవు పలికింది. వనిత ఈ వ్యాఖ్యలు కస్తూరీ, సూర్యాదేవి, విజయన్ వంటి వారిని ఉద్దేశించే చేసిందని అందరికీ అర్ధమైంది. మూడో పెళ్లి చేసుకున్న సమయంలో వీరంతా ఆమెను తీవ్రంగా విమర్శించారు. వనిత వ్యాఖ్యలను కోట్ చేస్తూ కొందరు నెటిజన్లు కస్తూరీని నిలదీయడంతో ఆమె ఘాటుగా స్పందించారు. ‘మీ జీవితాన్ని పర్సనల్‌గా ఉంచాలనుకున్నప్పుడు మీరు కూడా ప్రైవేట్‌గానే ఉండాలి’ అంటూ కస్తూరీ శంకర్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియో పెట్టినప్పుడు అది పర్సనల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘వనిత జీవితాన్ని ఎవరూ డిసైడ్ చేయడం లేదు.. అంతా ఆమే చేసుకుంది. అందరినీ సర్కస్‌లో కోతుల్లా ఆడిద్దామనుకుని చివరికి జోకర్‌లా మిగిలింది. అంతా అయ్యాక ఇప్పుడు నిజాయతీ, ముక్కసూటితనం వంటి మాటలు చెబుతుంటే నాకు నవ్వొస్తోంది’ అంటూ కస్తూరి సెటైర్లు వేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3olxmts
No comments:
Post a Comment