Thursday, 15 October 2020

ఆ బయోపిక్‌లో నటించొద్దు: విజయ్‌కి సీనియర్ డైరెక్టర్ వార్నింగ్

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య బయోపిక్‌లో నటిస్తున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతిపై తమిళ సంఘాలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయనపై తమిళ యూత్‌ సోషల్‌ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తూ విజయ్‌పై మండిపడుతున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ ఈ వివాదంలోకి వచ్చారు. Also Read: శ్రీలంక మత వాదానికి పూర్తిగా మద్దతు పలికి ఇండియాకు నమ్మకద్రోహిగా నిలిచిన మురళీధరన్‌ బయోపిక్‌లో నటించడం విజయ్ సేతుపతికి సరికాదని భారతీరాజా అన్నారు. ఆ బయోపిక్‌ వల్ల విజయ్‌ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆయన కెరీర్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన బాటలోనే దర్శకుడు శీను రామస్వామి, చేరన్‌ కూడా ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి హితవు పలికారు. ‘800’ పేరుతో తెరకెక్కుతున్న బయోపిక్‌లో విజయ్.. మురళీధరన్‌ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఎమ్మెస్‌ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌‌ను ఇండియాతో పాటు శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో చేసేందుకు యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. 2021 చివరికల్లా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తాజాగా ముసురుకున్న వివాదంతో ఈ సినిమా అసలు సెట్స్‌పైకి వెళ్తుందా? లేదా? అన్ని సస్పెన్స్‌గా మారింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355ZAQ2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....