Wednesday, 14 October 2020

గుట్కా స్మగ్లింగ్‌ కేసులో హీరో సచిన్ జోషి అరెస్ట్

సినీ నటుడు, నిర్మాత సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుట్కా అక్రమ రవాణా కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ని ముంబయి నగరంలో అదుపులోకి తీసుకున్నారు. గుట్కా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న కొందరిని కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా పేరు బయటికి వచ్చింది. Also Read: సచిన్ గురించి నిందితులు వెల్లడించిన అన్ని అంశాలను నిర్ధారించుకున్న ముంబయికి వెళ్లారు. అప్పటికే ఆయన అజ్ఞాతంలో ఉండటంతో ముంబయి ఎయిర్‌పోర్టులో నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అతడిపై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. గతంలోనే ఆయనకు నోటీసులు జారీచేసినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, దీంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. Also Read: ముంబయి నుంచి భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఇటీవల పక్కా సమాచారంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణ అనంతరం సచిన్ జోషి బెయిల్‌పై విడుదలైనట్లు సమాచారం. ‘మౌనమేలనోయి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్.. ఆ తర్వాత ఒరేయ్ పండు, ఆషికి-2 రీమేక్ చిత్రాల్లో నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/317MRv3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....