Sunday, 25 October 2020

అమ్మా రాజశేఖర్ నన్ను దారుణమైన మాటలు అన్నారు.. డబ్బులు ఎగ్గొట్టాడు: యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్‌ సీజన్ 4లో వివాదాస్పద వ్యక్తిగా మారారు. తొలివారంలో తన కామెడీ టైమింగ్‌తో అలరించినా.. రెండో వారం నుంచి సెల్ఫిష్‌గా మారిపోయారు. ఇక్కడిది అక్కడ.. అక్కడిది ఇక్కడ చెప్తూ బిగ్ బాస్ హౌస్‌లో పుల్లల రాయుడుగా మారారు. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు అమ్మా రాజశేఖర్ విలన్‌గా మారిపోయి.. ముసుగు తొలగిస్తుంటారు. తన గురించి తాను గొప్పగా చెప్పుకునే అమ్మా రాజశేఖర్‌ అసలు రూపం ఏంటో.. ఇప్పటికే జబర్దస్త్ పవన్ బయటపెట్టాడు.. తనకు అవకాశం ఇస్తానని తన ఇంట్లో పని చేయించుకుని చివరికి మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కమెడియన్ పవన్. అయితే సీరియల్ హీరో.. సీనియర్ నటుడు హాసన్ కూడా అమ్మా రాజశేఖర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘దాదాపు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. డబ్బు గురించి పెద్దగా పట్టించుకోను.. అయితే నన్ను కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మా రాజశేఖర్ అవమానించారు. ఆయన నన్ను అన్న మాటలు బాధపెట్టాయి. ఆయన ఎలా ఉంటారంటే.. సడెన్‌గా డేట్స్ అడిగుతారు.. వెంటనే ఓకే చెప్పేయాలి. నాకు సడెన్‌గా ఫోన్ చేసి రేపు షూటింగ్ వచ్చేయాలి అన్నారు.. నేను అప్పుడు వేరే షూటింగ్‌లో ఉన్నా అని చెప్పా.. నేను డబ్బులు ఇవ్వలేదని రాలేదా?? అని అన్నారు. ఆ మాట అనేసరికి నేను ఫీల్ అయ్యాను. నీ డబ్బులు ఎక్కడికి పోవు.. నేను ఇస్తానని అన్నాను కదా? అని అన్నారు. నిజానికి డబ్బుల విషయంలో ఇప్పటివరకూ నాకు ఎలాంటి కాంట్రవర్శీ లేదు.. డబ్బుల కోసం నేను డిమాండ్ చేయను. ఆ విషయం అందరికీ తెలుసు. నాకు చాలా మంది డబ్బులు ఎగ్గొట్టిన వాళ్లే ఉన్నారు తప్పితే.. నాకు డబ్బులు ఇస్తేనే వస్తాను అనే రికార్డ్ లేదు. టీవీలో చేశా.. సినిమాల్లో చేశా.. ఎప్పుడూ ఎవరూ నన్ను డబ్బు కోసం అన్నది లేదు. కానీ అమ్మా రాజశేఖర్ నాకు చాలా క్లోజ్ అయినప్పటికీ మిస్ అండర్ స్టాండింగ్ వచ్చింది. రేపు షూటింగ్‌కి రావాల్సిందే అని అని అంటే నేను ఎలా వెళ్తాను? నేను వేరే షూటింగ్‌లో ఉన్నాను సార్.. అంటే!! లేదు నువ్.. చాలా అన్ ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేస్తున్నావ్. ఇలా అయితే పైకి రాలేవు.. నువ్ ఇక కష్టం.. అని ఇలాంటి మాటలు అనేసరికి ఫీల్ అయ్యా.. అందుకే ఆయన సినిమా నుంచి తప్పుకున్నా.. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు.. ఆయన కూడా ఫోన్ చేసి అడగలేదు’ అంటూ చెప్పుకొచ్చారు సమీర్ హాసన్. అన్నట్టు సమీర్ కూడా బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్. ఎన్టీఆర్‌కి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో బిగ్ బాస్ సీజన్‌ 1లో అలరించాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35xrtAN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....