Saturday, 6 June 2020

Udaya Bhanu: ఉదయభాను కంటతడి! దటీజ్ బాలయ్య అంటూ వీడియోని వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..

గత కొన్నిరోజులుగా నందమూరి-మెగా వార్ తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినీ పెద్దలు ఎంత కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నా.. వార్ మాత్రం ఫ్యాన్స్ సాక్షిగా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో 60వ బర్త్ రాబోతుండటంతో నందమూరి ఫ్యాన్స్.. బాలయ్య గురించి ఇండస్ట్రీ వాళ్లు మాట్లాడిన కొన్ని ఎమోషనల్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. మరికొందరు ముందుగానే బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో యాంకర్ .. గతంలో బాలయ్య గురించి ఎమోషనల్‌గా షేర్ చేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లే కొడుతుంది. ‘నీతోనే డాన్స్ షో’ ప్రోగ్రామ్‌లో ఉదయభాను.. బాలయ్య గురించి, బాలయ్య వ్యక్తిత్వం గురించి చెబుతూ కంటతడిపెట్టుకున్నారు. అది అప్పుడు కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌తో నడుస్తున్న వార్‌లో భాగంగా.. ఈ వీడియోని నందమూరి అభిమానులు ఓ రేంజ్‌లో షేర్ చేస్తున్నారు. అందులో ఉదయభాను ఏం అన్నారంటే.. ‘నా నుంచి ఎన్నో ఆనందాలను దూరం చేసిన ఆ దేవుడు.. నాకంటూ నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్లే నా ప్రపంచం కావడంతో వాళ్ల ఫస్ట్ బర్త్ డే బాగా జరపాలని నిర్ణయించుకుని.. ఇండస్ట్రీలో చాలా మందికి కాల్ చేశాను. కనీసం స్పందించలేదు. గారికి చిన్న మెసేజ్ పెడితే అరగంటలో ఫోన్ చేశారు. అన్ని పనులు వదులుకుని నా బిడ్డల బర్త్ డే ఫంక్షన్‌కి వచ్చారు. సరిగ్గా టైమ్ అంటే టైమ్‌కి వచ్చారు. అందరు సెలబ్రిటీస్‌లా వచ్చి చూసి పోవడం కాదు.. 45 నిమిషాల ఉన్నారు. ఇండస్ట్రీలో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు. జై బాలయ్యా’ అంటూ ఎమోషనల్ అయ్యింది భాను. ఇదిలా ఉంటే.. యాంకర్ ఉదయభాను.. ఇప్పటికే ట్విట్టర్‌లో బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘కష్టం ఉందని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారని, ఎంత పని ఉన్నా పక్కనబెట్టి ఏమీ ఆలోచించకుండా వచ్చేస్తారని’ మరోసారి గుర్తు చేస్తూ.. బాలయ్యకు 60వ బర్త్ విషెస్ చెప్పింది ఉదయభాను. దాంతో నందమూరి అభిమానులు రీట్వీట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ANjELz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....