Thursday, 18 June 2020

Prabhas: ప్రభాస్‌కి ప్రతిష్టాత్మక అవార్డు.. పాన్ వరల్డ్ స్టార్! ఖుషీ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మక 'రష్యన్ ఆడియన్స్ హార్ట్' అవార్డు ఆయనను వరించింది. 2015 సంవత్సరానికి సంబంధించిన 'రష్యన్ ఆడియన్స్ హార్ట్' అవార్డులను ప్రకటించింది రష్యా. ఆ దేశంలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన స్టార్స్‌ని సెలక్ట్ చేసి ఆ వివరాలు తెలిపారు. అయితే ఇండియా నుంచి ఈ అవార్డు ప్రభాస్‌ని వరించింది. దాదాపు 30 యేళ్ల క్రిందట లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్ ఈ అవార్డు అందుకున్నారు. అప్పటి నుంచి మరే ఇతర ఇండియన్ స్టార్ సెలక్ట్ కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ పేరును 'రష్యన్ ఆడియన్స్ హార్ట్' అవార్డుల కమిటీ ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిపోయారు. తెలుగోడి సత్తాను ఎల్లలు దాటించిన '' సినిమాకు గాను ఈ అవార్డు లభించింది. Also Read: బాహుబలి సినిమా రష్యా ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించిందని, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ బాగా ఆకర్షించాయని చెప్పారు అవార్డు కమిటీ సభ్యులు. ఏ సమయంలోనైనా ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని ఈ సందర్భంగా వాళ్లు పేర్కొండటం విశేషం. తెలుగు సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన బాహుబలికి రష్యా నుంచి ఈ అరుదైన ఘనత దక్కడం పట్ల చిత్రయూనిట్ ఖుషీ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి మూవీ.. రెండు భాగాలుగా విడుదలై కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది. కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ ఆ మూవీదే అగ్రస్థానం. బాహుబలి తర్వాత 'సాహూ' మూవీలో నటించిన ప్రభాస్, ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2N4QOt8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....